AICC అగ్ర నాయకులు Sonia Gandhi, Rahul Gandhi కి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ ను NSUI తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించారు. తెల్లవారుజామునే రాజ్ భవన్ ఎదుట బైఠాయించటంతో NSUI నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ దాకా కాంగ్రెస్ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఓ బైక్ ను తగులబెట్టి మరీ కాంగ్రెస్ నాయకులు తమ ఆందోళన తెలియచేశారు.